HYD: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద హైడ్రా ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ హామీలను విస్మరించిందని ఆరోపించారు. కేవలం 150 పోస్టుల కోసం వేలాది మంది రావడం నిరుద్యోగ సమస్యకు నిదర్శనమన్నారు. యువతపై లాఠీలు ఎందుకు ప్రయోగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
యువతపై లాఠీలు ఎందుకు: రాంచందర్ రావు


