హైదరాబాద్: 28°C
వార్తలు

అమరావతి ఛాంపియన్‌షిప్‌కు విద్యార్థినుల ఎంపిక!

NDL: రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నె జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థినులు రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలకు శనివారం ఎంపికయ్యారు. జావలిన్‌త్రోలో బి.ఆయేషా ప్రథమ, లాంగ్‌జంప్‌లో ఎస్.సానా ద్వితీయ స్థానం సాధించారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి పాఠశాలకు మంచి పేరు తేవాలని పలువురు ఆకాంక్షించారు. హెచ్‌ఎం రాజేశ్వరి, ఉపాధ్యాయులు విజేతలను అభినందించారు.