W.G: పాలకొల్లు మండలం భగ్గేశ్వరం డ్రైయిన్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు ట్రాక్టర్లు ఢీకొన్నాయి. దీంతో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఓ పక్కకు ఒరిగిపోయింది. కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ కాస్త దూరం వెళ్లి ఆగిపోయింది. డ్రైవర్లు ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వార్తలు
భగ్గేశ్వరం డ్రెయిన్ వద్ద యాక్సిడెంట్


