SKLM: దీపావళి నుంచి మెండపేటకు వెళ్లే రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. చిన్నపాటి వర్షం కురిసినా గోతుల్లో నీరు చేరి రాకపోకలు ప్రమాదకరంగా మారుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో గోతులు కనిపించక వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
గోతులతో గార-మెండపేట రహదారి అధ్వానం


