హైదరాబాద్: 28°C
వార్తలు

భారత పర్యటనలో ట్రంప్‌ చిన్నల్లుడు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్న అల్లుడు మైఖెల్ బౌలోస్ భారత్‌లో పర్యటిస్తున్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా కేరళలోని కొచ్చికి చేరుకున్నారు. ఆయనతో పాటు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఉన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. మైఖెల్ బౌలోస్ అలప్పుళలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు చెప్పింది.