హైదరాబాద్: 28°C
వార్తలు

ముద్దనూరులో ప్రకృతి వ్యవసాయానికి ఊతం..!

KDP: ముద్దనూరు మండలం ఉమ్మారెడ్డిపల్లెలోని శ్రీ బాలాజీ బయో ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో యామవరం రైతు దేవిరెడ్డి వివేకానందరెడ్డి 30 ఎకరాల పొలానికి 24 టన్నుల ఘనజీవామృతాన్ని తయారు చేశారు. 24 టన్నుల ఆవుపేడ, 1,200 లీటర్ల ఆవుమూత్రం, 500 కిలోల శనగపిండి, 500 కిలోల బెల్లంతో తయారు చేశారు. వ్యవసాయ సిబ్బంది ఘనజీవామృతంతో భూసారం పెరుగుతుందన్నారు.