CTR: శ్రీరంగరాజపురం మండల ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 10న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు హాజరై ప్రజల సమస్యలను స్వీకరించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
వార్తలు
10న ప్రజా సమస్యల పరిష్కార వేదిక


