హైదరాబాద్: 28°C
వార్తలు

బొల్లవరంలో పర్యటించిన ఎమ్మెల్యే

NDL: గడివేముల మండలం బొల్లవరం గ్రామంలో శనివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక టిడిపి నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఘనంగా ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఆమె అన్నారు.