హైదరాబాద్: 28°C
వార్తలు

దేశం కోసం BJP ఏమీ చేయలేదు: ఖర్గే

దేశం కోసం బీజేపీ, RSS ఏమీ చేయలేదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వెల్లడించారు. స్వాతంత్య్ర పోరాటంలో వారు ఎలాంటి సేవ చేయలేదని తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ఏ RSS సభ్యుడైనా జైలుకు వెళ్లారా.. అని నిలదీశారు. ఏ బీజేపీ కార్యకర్త అయినా జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా వెళ్లి ఉంటే, వారు మొదట కాంగ్రెస్‌లో ఉండి తర్వాత ఆ వైపు వెళ్లినవారే అయి ఉంటారని పేర్కొన్నారు.