కాంగ్రెస్ పార్టీ నాయకత్వ వైఖరిపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. మాజీ ప్రధాని ఇందిరా హయాంలో విధించిన ఎమర్జెన్సీ నిర్ణయాలను ఆమె నిర్మొహమాటంగా అంగీకరించారని తెలిపారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ నాయకత్వం మాత్రం తమ సొంత తప్పులను, లోపాలను గుర్తించడమే లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతల అరెస్టులను సమర్థిస్తూ ఇందిరా ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియోను ఆయన షేర్ చేశారు.
వార్తలు
'ఇందిరా గుర్తించింది..కాంగ్రెస్ గుర్తించడం లేదు'


