హైదరాబాద్: 28°C
వార్తలు

'వలిసెల సాగుపై రైతులకు శిక్షణ'

ASR: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వలిసెల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఎల్‌నినో, తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగుచేయగల పంటగా వలిసెలను ప్రోత్సహించాలని నిపుణులు సూచించారు. వలిసెల సాగుతో అదనపు ఆదాయం లభిస్తుందని ఏడీఆర్ డా. ఆదిలక్ష్మి తెలిపారు. విత్తన ఎంపిక, విత్తే సమయం, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు.