SRD: సంగారెడ్డి మండలం నాగపూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో విద్యుత్ స్తంభం ఒక వైపునకు వంగి ప్రమాదకరంగా మారింది. నిత్యం వాహనాల రాకపోకలు సాగించే ఈ మార్గంలో స్తంభం వంగడంతో వాహనదారులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అపశ్రుతి జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, పాత స్తంభాన్ని తొలగించి నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వార్తలు
వంగిన విద్యుత్ స్తంభం.. ప్రజల అవస్థలు


