హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతుల సమస్యలు పరిష్కరించాలి'

ASR: రైతుల ఆదాయం పెంచేలా వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు సకాలంలో అందుబాటులో ఉంచడంతో పాటు, సూక్ష్మ సేద్యం, పంటల మార్పిడికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అధికారులు, క్షేత్రస్థాయిలో పర్యటించి, రైతుల సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు.