హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సేవల్లో జాప్యం వద్దు: సీఎండీ

HYD: వినియోగదారులకు జాప్యం లేకుండా పారదర్శకంగా విద్యుత్ సేవలు అందించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఏఎస్ ఆదేశించారు. యూసుఫ్‌గూడ సీపీటీఐలో యూఎస్‌ఎల్‌సీపై నిర్వహించిన శిక్షణలో 21 ఆపరేషన్ సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. దరఖాస్తులను గడువులోగా పరిష్కరించి, వినియోగదారుల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు.