హైదరాబాద్: 28°C
వార్తలు

అడుగడుగునా గుంతల మయం

MDK: నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ ప్రధాన రహదారి వర్షాలకు దెబ్బతిని తీవ్ర బురదమయంగా మారింది. రోడ్డంతా గుంతలమయమై నీరు నిలవడంతో వాహనదారులు, గ్రామస్థులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. అత్యవసర వేళల్లో ప్రయాణం కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.