TG: ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు కోటీశ్వరులు కూడా తీసుకుంటున్నారని, 'రైతుబంధు'తో ఎంతోమంది కోటీశ్వరులు లబ్ధి పొందుతున్నారని పేర్కొంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుందని చెప్పింది. ఉచిత పథకాలతో భవిష్యత్ తరాలకు ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయని ప్రశ్నించింది. చదుకునే వారికి ఫీజులు, అర్హులైన వారికి పథకాలు ఇవ్వండని సూచించింది.
వార్తలు
ఉచిత పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు


