హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదోనిలో నేతన్నలకు ప్రభుత్వం భరోసా!

KRNL: ఆదోని పెద్దశక్తి గుడి వద్ద చేనేత వర్గాల ఆధ్వర్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నేతన్న సేవ పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, కేశవ రెడ్డి, తదితరులు పాల్గొని చేనేత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించారు.