హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో పలు భవనాల మంజూరుకు ప్రతిపాదనలు

WNP: ఎమ్మెల్యే మేఘారెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సమర్పించారు. జిల్లా రవాణా కార్యాలయంతో పాటు నాలుగు బీసీ సంక్షేమ విద్యాసంస్థల నూతన భవనాలు మంజూరు చేయాలని కోరారు. విద్యార్థులకు మెరుగైన వసతి, విద్యా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం అన్నారు. ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.