VZM: దత్తిరాజేరు మండల కేంద్రంలో రూ.53 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మండల రిసోర్స్ కేంద్రం భవనాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, విద్యా శాఖ సిబ్బంది ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వార్తలు
MRC భవనాన్ని ప్రారంభించిన మంత్రి


