హైదరాబాద్: 28°C
వార్తలు

ఏనుగుల బీభత్సం.. పంటలు ధ్వంసం

అన్నమయ్య: కే.వీపల్లి మండలం జిల్లెల్లమంద పంచాయతీ బసన్నగారిపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. వరి పంటను తొక్కి నష్టం కలిగించడంతో పాటు మామిడి తోటలో సుమారు 80 చెట్లను విరిచేశాయి. నీటి పైపులు, ఇనుప కంచెను ధ్వంసం చేశాయి. రైతులు మనుబోతు నాగమ్మ, పచ్చిపాల నారాయణస్వామికి నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అటవీ, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు.