హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అరకువేలిలో ఉద్రిక్తత వాతావరణం

ASR: మన్యం బంద్ సందర్భంగా అరకువేలిలో శనివారం ఆదివాసీ, ప్రజా సంఘాల నేతలు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. బంద్‌కు మద్దతుగా వాహనాలు నిలిచిపోయాయి. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా తొలగించి, రాకపోకలను పునరుద్ధరించారు. తమ నిరసన హక్కును హరించడం సరికాదని పలువురు ఆదివాసీ సంఘాల నేతలు కిల్లో సురేంద్ర, పొద్దు బాలదేవ్, కిండంగి రామారావు పేర్కొన్నారు