హైదరాబాద్: 28°C
వార్తలు

SSD టోకెన్ల జారీపై TTD కీలక ప్రకటన

AP: తిరుమలలో ఉచిత సర్వదర్శనం (SSD) టోకెన్ల జారీ సమయాలపై ఎలాంటి ముందస్తు నిర్దిష్ట సమయం ఉండదని TTD స్పష్టం చేసింది. రోజూ ఒకే నిర్ణీత సమయానికి టోకెన్లు జారీ కావని పేర్కొంది. కొండపై ఉండే భక్తుల రద్దీ, క్షేత్రస్థాయి నిర్వహణ అవసరాలు, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగానే టోకెన్ల పంపిణీ సమయాలను ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారని తెలిపింది. భక్తులు ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరింది.