హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాభావంతో ఆందోళనలో రైతులు

KKD: పెదపూడి మండలంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక పంట పొలాలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. బోర్లు, కాలువల ద్వారా నీటిని అందిస్తున్నప్పటికీ వరిపొలాల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఖరీఫ్ సాగు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.