హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

AP: జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 2.32 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 876 అడుగులకు నీటి మట్టం చేరింది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215 TMCలు కాగా.. ప్రస్తుతం 169.46 TMCల నీరు నిల్వ ఉంది. 2 జలవిద్యుత్ కేంద్రాల ద్వారా 66,460 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.