ASR: అరకు సచివాలయంలో ఈ నెల 10న సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహించనున్నట్లు డుంబ్రిగూడ ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు కార్యక్రమానికి హాజరై సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు.
వార్తలు
ఈ నెల 10న పీజీఆర్‌ఎస్


