హైదరాబాద్: 28°C
వార్తలు

తుంగభద్ర డ్యామ్‌కు పెరుగుతున్న వరద

ATP: తుంగభద్ర డ్యామ్‌కు శనివారం ఉదయం సమయానికి ఇన్‌ఫ్లో 41,802 క్యూసెక్కులుగా నమోదు కాగా, అవుట్‌ఫ్లో 1,081 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 71.951 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా తుంగభద్ర డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం కొనసాగుతుండటంతో డ్యామ్‌లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.