హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువు కట్ట లీకేజీ.. పనులు చేపట్టిన సర్పంచ్

SRCL: కురుస్తున్న భారీ వర్షాలకు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామ శివారులోని గాలం చెరువు నిండుకుండలా మారింది. వరద నీటి ఉధృతికి చెరువు కట్ట తూము వద్ద లీకవడంతో రైతులు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో జేసీబీ వాహనంతో మరమ్మతు పనులు సర్పంచ్ రమేష్ చేపట్టారు. లీకవకుండా చర్యలు తీసుకున్నారు.