హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 15న చిత్రలేఖనం పోటీలు

అనకాపల్లిలోని సిటీ పబ్లిక్ పాఠశాలలో ఈనెల 15న చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి రామ చంద్రరావు తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 3 నుంచి పోటీలు జరుగుతాయన్నారు. 6, 7 తరగతుల విద్యార్థులు ఒక గ్రూపు, 8, 9, 10 తరగతుల విద్యార్థులు మరో గ్రూపుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. పట్టణానికి చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు.