కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించనున్నారు. కేపీ గ్రౌండ్‌లో నిర్వహించనున్న 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమంలో భాగంగా ఆయన పోటీ పరీక్షల విద్యార్థులు, యువతతో సమావేశమై పేపర్ లీకేజీలు, ఉద్యోగాల భర్తీ తదితర సమస్యలపై చర్చిస్తారు. తొలుత అనుమతి రద్దయినా, తాజాగా షరతులతో కూడిన అనుమతి లభించడంతో ఈ పర్యటన యథాతథంగా కొనసాగుతోంది.
వార్తలు
నేడు ప్రయాగ్‌రాజ్‌లో రాహుల్ గాంధీ పర్యటన


