హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా టెన్నిస్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్‌గా నిజామ్

BPT: బాపట్ల జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ మొదటి ఛైర్మన్‌గా చందోలుకు చెందిన టీడీపీ నాయకుడు ఎస్ఎస్‌ నిజామ్ నియమితులయ్యారు. ఈ నియామకాన్ని శుక్రవారం ఏపీ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. తనను ఎంపిక చేసినందుకు రాష్ట్ర కమిటీకి నిజామ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో టెన్నిస్ బాల్ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.