AP: అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణం నెలకొంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
వార్తలు
నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు


