హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి కోసం ప్రణాళిక: గంటా

VSP: జీవీఎంసీ 4వ వార్డు పరిధిలో తాగునీటి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని భీమిలి ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఎంవీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. సముద్ర తీర గ్రామాలైన తిమ్మాపురం, చేపలుప్పాడ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పునీటిమయం కావడంతో తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తెచ్చారు.