హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంపై మరాఠా ఉద్యమ నేత మండిపాటు

మహారాష్ట్ర సీఎం దేవేంద్రపై మరాఠా ఉద్యమ నేత జరాంగే పాటిల్ మండిపడ్డారు. మరాఠా సమాజానికి అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. కుల ధ్రువపత్రాల మంజూరులో భారీ అవినీతి జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కేసులో రూ.15 లక్షల లంచం కోరినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. తనను రాజకీయంగా ఒంటరి చేసి జైలుకు పంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.