ఉత్తరాఖండ్ పౌరీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దేవ్‌ప్రయాగ్ నుంచి పౌరీ వైపు వెళ్తున్న బొలెరో వాహనం సబ్దర్‌ఖాల్ వద్ద అదుపుతప్పి దాదాపు 250 మీటర్ల లోయలో పడింది. ఈ ఘటనలో వాహనంలోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
లోయలో పడిన బొలెరో.. ఐదుగురు మృతి


