హైదరాబాద్: 28°C
వార్తలు

హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: భారత్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంపై ఆ దేశం అభ్యంతరం వ్యక్తం చేయడంపై భారత్ స్పందించింది. హసీనా మీడియా సమావేశం ఓ ప్రవేట్ సంస్థ నిర్వహించిందని.. దానికి భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఆమె వ్యాఖ్యలను భారత్ సమర్థించటం లేదని స్పష్టం చేసింది. కాగా, 2024 ఆగస్టు నుంచి హాసీనా ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.