హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువు భూమిపై కబ్జా ఆరోపణలు

SKLM: పలాస మండలం తర్లాకోటలోని భద్రాక్షి బంద చెరువు 3.09 ఎకరాల భూమిపై వివాదం నెలకొంది. చెరువు భూమిని జిరాయితీగా చూపి రిజిస్ట్రేషన్లు చేసి, మట్టితో పూడ్చి రియల్ ఎస్టేట్ చేస్తున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు సర్వేయర్ సంతోష్, VRO బైరాగి క్షేత్రస్థాయిలో పరిశీలించి 3.09 ఎకరాలను ప్రభుత్వ భూమిగా గుర్తించి బౌండరీ పిక్స్ వేశారు.