హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

W.G: ఉండి మండలంలోని పలు గ్రామాలలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఉండి విద్యుత్ ఉపకేంద్రం ఈఈ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉ. 8 గం.ల నుంచి మ. 1 గం.ల వరకు విద్యుత్ కోత ఉంటుందన్నారు. వార్షిక మరమ్మతుల నిమిత్తం మండలంలోని ఉండి, పెదపుల్లేరు, చెరుకువాడ, కలిసిపూడి, ఎన్ఆర్‌పీ అగ్రహారం, మహాదేవపట్నం, చిలుకూరుకు కోత ఉంటుందని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.