హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

అన్నమయ్య: రాయచోటి పట్టణ పరిధిలోని 33/11 కేవీ మాసాపేట సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ శివ దినేశ్ కుమార్ తెలిపారు. మాసాపేట, రెడ్డివారిపల్లి, వీరబల్లి రోడ్డు, సాయి ఇంజినీరింగ్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని పేర్కొన్నారు.