హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రకృతి సేద్యమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష'

VZM: రసాయనిక వ్యవసాయం విడిచిపెట్టి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని ప్రకృతి వ్యవసాయ ఐసీఆర్‌పీ రఘు పిలుపునిచ్చారు. మెరకముడిదాం మండలం ఊటపల్లి గ్రామంలో శుక్రవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరి పంటలో పాటించవలసిన వివిధ రకాల ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, కషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పించారు.