SKLM: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పలాస రైల్వే గ్రౌండ్స్‌లో ఆగస్టు 9న అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
పలాసలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు


