హైదరాబాద్: 28°C
వార్తలు

పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు?

ప్రధాని మోదీతో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ భేటీ కావడం పంజాబ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంతో బీజేపీ-అకాలీదళ్ మధ్య మళ్లీ పొత్తు అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ భేటీపై సుఖ్‌బీర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలులో అవినీతిపై చర్చించినట్లు తెలిపారు. ఈ 2 పార్టీలు దాదాపు 25 ఏళ్ల పాటు కూటమిగా ఉండి.. 2020లో విడిపోయాయి.