ADB: పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా నేరడిగొండ మండలంలోని వాగ్దారి గ్రామంలో SP అఖిల్ మహాజన్ శుక్రవారం పర్యటించారు. గ్రామానికి వచ్చిన ఎస్పీకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో SP మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి మార్గంలో ముందుకు వెళ్లాలని సూచించారు. గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని యువకులకు పిలుపునిచ్చారు.
వార్తలు
గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: SP


