KDP: ముద్దనూరు మండలంలోని ముద్దనూరు, బొందలకుంట, మంగపట్నం, ఉప్పలూరు సబ్‌స్టేషన్లలో మరమ్మతుల కారణంగా ఆగస్టు 8న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ తెలిపింది. 11 కేవీ ఫీడర్ లైన్ల నిర్వహణ పనులు జరుగుతున్నాయని అన్నారు. కావున రైతులు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


