హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త పింఛన్‌ దరఖాస్తులు స్వీకరణ : ఎంపీడీవో

BDK: దమ్మపేట మండలంలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఫైలేరియా బాధితుల నుంచి కొత్త పింఛన్‌ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు శుక్రవారం ఎంపీడీవో రవీందర్‌రెడ్డి తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల్లోపు, భూమి తరి మూడు, మెరక 7.5 ఎకరాల్లోపు ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే, అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు.