కడప నగరంలోని 15వ డివిజన్ సాగర్ కాలనీలో వారం రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనిపై నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ప్రజలకు కనీసం బోరు ఉప్పు నీరు కూడా అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ విమర్శించారు.
వార్తలు
ఖాళీ బిందెలతో నిరసన


