GNTR: కాకుమాను (మం) అప్పాపురం వద్ద దెబ్బతిన్న పాత పైప్‌లైన్‌కు గ్రామస్థులు, తెలుగు యువత సొంత నిధులతో రెండు రోజులుగా మరమ్మతులు చేపడుతున్నారు. ఈ పైప్‌లైన్ పాడవడంతో పెదనందిపాడు ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తలెత్తడమే కాకుండా, నీటి నాణ్యతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే తాగునీటి సరఫరాను పునఃప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు.
వార్తలు
సొంత ఖర్చులతో పైప్‌లైన్ మరమ్మతులు


