బీహార్ రాజధాని పట్నాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకోవడంపై ఆందోళనకారులు 3 పోలీసు జీపులకు నిప్పుపెట్టడంతో పాటు, వారిపై రాళ్లు రువ్వారు. దీంతో అధికారులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
వార్తలు
పోలీసు జీపులకు నిప్పుపెట్టిన నిరసనకారులు


