హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతి ఒక్కరూ మొక్క నాటాలి: సర్పంచ్

RR: తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో వానమహోత్సవంలో భాగంగా సర్పంచ్ పి.మల్లేష్ ప్రజలకు పండ్ల, పూల మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్క నాటి సంరక్షించాలని, గ్రామాన్ని పచ్చదనంతో నింపాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మంజుల, పంచాయతీ కార్యదర్శి అనిత తదితరులు పాల్గొన్నారు.