డాబర్ ఇండియాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వందశాతం స్వచ్ఛత పేరుతో తేనె, ఆవు నెయ్యి, నూనెలు వంటివి విక్రయించొద్దంటూ FSSAI జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించింది. విచారణకు అవకాశం లేకుండా నిషేధం విధించడం సరికాదని పేర్కొంది. తదుపరి విచారణ వరకు స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
వార్తలు
డాబర్ ఇండియాకు హైకోర్టులో ఊరట


