హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ మంత్రికి ఘన నివాళి

KDP: జమ్మలమడుగులోని నాగలకట్ట వీధి సంజామల మోటు సమీపంలో మాజీ కార్మిక శాఖ మంత్రి పొన్నపరెడ్డి శివారెడ్డి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, పొన్నపరెడ్డి లక్ష్మీదేవమ్మ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.